Natyam ad

కన్న కొడుకు కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

నల్గోండ ముచ్చట్లు:
 
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన సైదులు లక్ష్మి ఒక్కగానొక్క కొడుకుని శరత్ ఎంబిబిఎస్ చదువు నిమిత్తం ఉక్రెయిన్ దేశానికి పంపారు. రష్యా, ఉక్రేయిన్ యుద్దం నేపధ్యంలో కాలేజీ యాజమాన్యం
కానీ హాస్టల్లో ఉన్న వారు కానీ భారతదేశ విద్యార్థులను పట్టించుకోవడం లేదంటూ శరత్ తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి కన్నీరుమున్నీరవుతున్న ట్లు గా తెలిపారు సైదులు లక్ష్మి. తన
కొడుకుతో పాటు మిగతా విద్యార్థులను కూడా భారతదేశానికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటున్నారు నకిరేకల్ లో నివాసముంటున్న సైదులు మరియు లక్ష్మి లు. శరత్ ఉంటున్న ఊర్లో శరత్ బాగానే
ఉన్నాడని నిన్న చెప్పిన ఈ రోజు ఫోన్ కలవకపోవడం తో శరత్ తల్లి లక్ష్మి ఫోన్ పట్టుకుని కూర్చుంది. వాట్సాప్ లో లో ఒక మెసేజ్ పెట్టాడు అని తాను తనతో ఉన్న తన మిగతా విద్యార్థులు అంతా హాస్టల్
కింద ఉన్న బంకర్ లోకి వెళ్ళి పోవలసిందిగా కాలేజీ యాజమాన్యం ప్రభుత్వం ఐరన్ ఇవ్వడంతో బంకర్లో కి వెళ్తున్నానని చెప్పడంతో కొంత ఊరట పొందిన సైదులు లక్ష్మి లు కొడుకు రాక కోసం
భయపడుతూనే ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు శరత్ వీడియో కాల్ ద్వారా మాట్లాడని వెంట ఉన్న తిండిపదార్థాలు మంచినీళ్లు కొద్దిగానే ఉన్నాయని అవి అయిపోతే తినడానికి కూడా తిండి
దొరకదు అని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తల్లిదండ్రులు తెలిపారు. బంకర్ లలో ఉన్న విద్యార్థులను భారతదేశం నుండి గాని లేక ఉక్రెయిన్ ప్రభుత్వం నుండి గాని ఎటువంటి ఇ సహాయము అందలేదని
ఎవరు ఫోన్లు కూడా చేయలేదని శరత్ తెలిపినట్లుగా తండ్రి సైదులు అన్నారు.
 
Tags: Kanna parents for Kanna son