పుంగనూరు పుష్కరిణిలో కార్తీకదీపోత్సవ వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు పుష్కరిణిలో కార్తీకదీపోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని తుంగా మంజునాథ్‌ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాల క్రితం ఒక దీపంతో దీపోత్సవాలు ప్రారంభమైంది. ఆనాటి నుంచి పట్టణ ప్రజలకు కార్తీకదీపోత్సవాలు వేడుకగా , భక్తితో నిర్వహించడం అలవర్చుకున్నారు. ప్రస్తుతం పుష్కరిణీలో లక్షదీపాలతో వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని చిన్నా, పెద్ద తేడా లేకుండ ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పుష్కరిణి ప్రజలతో క్రిక్కిరిసిపోయింది. శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పుష్కరిణి దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందింది. ఈ కార్యక్రమంలో కెసిటివి అధినేత ఎన్‌.ముత్యాలు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌తో పాటు పట్టణంలోని ప్రముఖ వ్యాపారులు జయరామిరెడ్డి, కె .బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

 

Tag: Kartikedi festival celebrations in Punganuru Pushkarini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *