బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కావలి ఆర్.డి.ఓ.

బోగోలు ముచ్చట్లు:
బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేది నుండి 19వ తేది వరకు జరుగుతుండటంతో కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి శీనా నాయక్ ఆలయానికి విచ్చేసి ఆలయ కార్యనిర్వహణ అధికారి అరవ రాధాకృష్ణ మరియు బోగోలు మండలం తహసిల్దారు పి.లక్ష్మీనారాయణతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలు గిరి ప్రదక్షిణతో మొదలు కానుండటంతో కొండ చుట్టూ ఉన్న రోడ్డును ముందుగా పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. తదుపరి విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్ళుగా రథం లేకపోవడంతో భక్తుల రద్దీ అంతగా లేదని కానీ ఈ సంవత్సరం నూతన రథం సిధ్ధంగా ఉందని కావున గత ఏడాది కన్నా ఈ ఏడు ఎక్కువ మంది భక్తులు ఉత్సవాలకు విచ్చేసే అవకాశం ఉన్నందున  వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన విధంగా పారిశుద్ధ్యం,వైద్య,విద్యుత్ మరియు రక్షణ శాఖ ముఖ్య పాత్ర పోషించాల్సి ఉండగా ఆ శాఖల ఏర్పాట్లను పరిశీలించేందుకు రావడం జరిగిందని అన్ని శాఖల వారితో కలసి సమన్వయంగా బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిట్రగుంట ఎస్సై  పి.చిన్న బలరామయ్య వైకాపా నాయకుల కర్తం సురేంద్ర రెడ్డి మరియు ఆలయ సిబ్బంది ఉన్నారు.
 
Tags:Kavali RDO inspected the arrangements for Brahmotsavala

Natyam ad