Natyam ad

కేసీఆర్ 22 కార్లు విజయవాడలో ఉన్నాయి..

హైదరాబాద్ ముచ్చట్లు:



పాలనలో భాగంగా గ్రా మ పంచాయతీలలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చని అన్నారు. గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వచ్చన్నారు. గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చని తెలిపారు. సచివాలయంలో ప్రజాపాలన లోగో, దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఆవిష్కరించారు. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పదేళ్లు ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజా వాణి చూస్తే అర్థం అవుతుందన్నారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండ ఉండేలా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  దరఖాస్తుతో వివరాలు  అందుతాయని ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయగలుగుతామనేగి తెలుస్తుందన్నారు. మంచి ఆలోచనతో చేస్తున్నామని తెలిపారు. ప్రతి మండలం రెండు గ్రూపులు ఉంటాయని, ఒక గ్రూప్ కి ఎండీఓ.. మరో గ్రూప్ కి ఎమ్మార్వో బాధ్యత వహిస్తారని క్లారిటీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చని అన్నారు. గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వచ్చన్నారు. గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చని తెలిపారు. ఎవరి కోసం ఎదురు చూడంకండి ఎవరి దగ్గరకు పోవద్దని సూచించారు.  ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్పీఎస్ పై క్లారిటీ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వాలి అంటే చైర్మన్ ఉండాలని.. కానీ.. అందరూ రాజీనామా చేశారని తెలిపారు. రాష్ట్రపతి అనుమతి గవర్నర్ కోరారని,

 

 

 

వాటిని పరిశీలించి..చెప్తా అన్నారు. గందరగోళం కాకూడదని రాష్ట్ర ప్రజలకు సూచించారు. నాలుగైదు రోజుల్లో గవర్నర్ నిర్ణయం ఇచ్చిన వెంటనే కమిటీ నియామకాలు జరుపుతామని అన్నారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. కేటీఆర్…ప్రజా వాణి  సమస్య పరిష్కారం కాలేదు అంటున్నాడని మండిపడ్డారు. లక్ష కోట్లలో లక్ష సాయం చేశారు కేటీఆర్ అన్నారు. ప్రజా వాని లక్ష్యం నెరవేరినట్టే అని.. కేటీఆర్ లక్ష కోట్లను..ప్రజలకు పంచిపిస్తాం.. లక్ష ఇచ్చాడు..ఇంకా మిగిలినవి ఇప్పిస్తామమన్నారు. అధికారం పోయినందున విత్ డ్రాయల్ సింప్టమ్‌తో  కేటీఆర్ బాధపడుతున్నారని రేవంత్ సెటైర్ వేశారు.  మంచంకి కట్టేసే వైద్యం చేయించాల్సి వస్తుందని వ్యంగాస్త్రం వేశారు. మెడిగడ్డలో ఎవరి పాత్ర ఎంత అనేది తేలుతుందన్నారు. ఖజానా అంతా ఊడ్చుకు పోయాడని మండిపడ్డారు. అందుకే శ్వేతపత్రం ఇచ్చామన్నారు. మేడిగడ్డ అన్నారం మీద విచారణ చేస్తున్నాం.. ముందుంది ముసళ్ళ పండగ.. అన్ని వసూలు చేస్తామన్నారు. అధికారిక సమాచారం వాళ్లకు ఇచ్చే వివరాలు కూడా ఉన్నాయన్నారు. మీదగ్గర ఉన్న వివరాలు కూడా ఇవ్వండి అని మీడియా మిత్రులకు రేవంత్ అన్నారు.   ఎక్కడెక్కడి నుండి నిధులు వస్తాయి అనేది.. చూస్తామన్నారు. కేంద్రం నుండి నిధులు ఆడిగామన్నారు.  సైనిక స్కూల్ వరంగల్ నుండి ఎందుకు పోయిందో చెప్పమని అడగండి అన్నారు. బుల్లెట్ ట్రైన్ గురించి అడిగే వినోద్ రావు.. సైనిక స్కూల్ ఎందుకు తరలిపోయింది ఎందుకో చెప్పు? అని ప్రశ్నించారు. రేషన్ కార్డులు ఇస్తాం కొత్తవి అన్నారు. మూడో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడుకోవడానికి కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ కార్లను విజయవాడలో దాచి  పెట్టారన్నారు. ఒక్కో కారు విలువ మూడు కోట్లు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విషయం తెలియడానికే తనకు చాలా సమయం పట్టిందన్నారు. ఇలా ఖజానాను ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకున్నారని మండిపడ్డా.

 

Post Midle

Tags: KCR 22 cars are in Vijayawada..

Post Midle