KCR dreams of eradicating corruption

అవినీతి నిర్మూలనపై కేసీఆర్‌ కలలు!?

-అక్రమార్కుల అంతుచూస్తానంటూ బీరాలు

-తిరుగుబాటు చేయాలని ప్రజలకు సీఎం పిలుపు

Date: 06/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

ప్రభుత్వ ఆఫీసుల్లో, అధికారుల్లో లంచం లేకుండా పని అవుతుందా? ఇది దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వానికైనా అవినీతిని ప్రాలదోడడం సాధ్యం అయిందా? అవినీతిని నామరూపాలు లేకుండా చేస్తాని ప్రతిన బూనిన ప్రభుత్వాలే అవినీతి ఊబిలో కూరుకుపోతున్న నేటి కొత్త తరం రాజకీయాల్లో అవినీతిని అంతమొందించడం నిజంగా సాధ్యం అవుతుందా? కేసీఆర్‌ తన అధికారిక క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఇదే అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే లంచం ఇవ్వాల్సి వస్తుందనే భావన ప్రజల్లో తొలగించాలని అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో లంచం ఇవ్వకుండా పనులు జరిగినప్పుడే అవనీతి రహిత పాలన జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎస్‌ డాక్టర్‌ రాజీవ్‌ శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య, సీఎంవో అధికారులు నర్సింగ్‌ రావు, శాంతకుమారి, స్మితా సబర్వాల్‌, ప్రియాంక వర్గీస్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అవినీతిని పారదోలి ప్రజలకు పారదర్శక పాలన అందించాలని అన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలందరికీ చేరాలని అన్నారు. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా వచ్చే 8-10 ఏళ్ల కోసం ప్రణాళిక సిద్ధం చేసి ఇప్పటి నుంచే పని ప్రారంభించాలని సూచించారు. ఏయే జిల్లాల్లో ఏమేమి చేయాలన్న దానిపై పక్కా ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాల అవసరాలకు తగినట్టుగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు వెళ్లిన కలెక్టర్లంతా యువకులేనని, సేవ చేయాలనే తపనతో ఉన్నవారేనని అన్నారు. వారంతా ఓ పద్ధతి ప్రకారం పనిచేస్తే అద్భుత ఫలితాలను చూడవచ్చని కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి రూపుమాపడం నిజంగా కేసీఆర్‌ కు సాధ్యం అవుతుందో లేదో చూడాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ”నేను మోనార్క్‌ ను నన్ను ఎవ్వరు మోసం చేయలేరు” అని సుస్వాగతం సినీమాలో ప్రకాష్‌రాజ్‌ సంధించే డైలాగ్‌ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. ”నేను నిజాయితీ గల నాయకుడిని నన్ను మోసం చేయడం ఎవ్వరికి సాధ్యం కాదు” అని పదే పదే చెబుతున్న చంద్రబాబుకు అసలు విషయంలో తెలుసా? లేకా కావాలనే అలా చేస్తున్నాడా తెలియదు కానీ, దేశంలో ఏ ముఖ్యమంత్రి మోసపోని విధంగా చంద్రబాబు మోసపోతున్నారు! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చంద్రబాబు ఉన్న మిత్రబంధం అందరికి తెలిసిందే. అయినా ఆయన ఏపీకి రావాలసిన ప్రత్యేక హోదా విషయంలో భారీగానే మోసపోయారు. ఇక ప్రత్యేక హోదా విషయంలోనే కాకుండా ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. ఆ మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించింది ప్రత్యేక ఆర్థిక సాయం మాత్రమే. కానీ దానికి ప్యాకేజీ అని పేరు పెట్టి ప్రచారం చేస్తున్నారు. దానికి కూడా ఇప్పటివరకు చట్ట బద్దత కల్పించలేదు. అయినా చంద్రబాబు మాత్రం చెవులు ఊపుతున్నారే తప్ప ఒక్కసా రైనా కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేయడం లేదు. ఇక ప్రత్యేక హోదా నాటకం ఎంత రసవత్తరంగా నడిచిందో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదంతా పోను తాజాగా చంద్రబాబు కేసీఆర్‌ చేతిలో మోసపోతున్నారు. అదేలా అంటే తాజాగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను తమకు అప్పగించాలని కేసీఆర్‌ అడిగారు. సచివాలయంలోని మొత్తం భవనాలకు కూల్చేసి అత్యాధునికంగా కొత్త సచివాలయం కట్టుకుంటామన్నారు. అంతేకాకుండా అసెంబ్లీ కూడా ఇచ్చేయాలని కోరారు. ఎలాగూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకుని ఆంధ్రాకు వెళ్లిపోయారు కదా. ఇక మిగిలినవన్ని మాకే కదా మాది మాకు ఇచ్చేయం డంటూ సరాసరి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు విన్నవించుకున్నారు. దీనికి గవర్నర్‌ కూడా ఓకే చెప్పేయడం, ఆ తరువాత ఏపీ మంత్రి వర్గం తీర్మానం చేయడం పార్లర్‌గా జరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా అత్యవసర భేటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు దీనిపై సానుకూలంగా స్పందించారు. కేసీఆర్‌తో లేనిపోని చికాకులు ఎందుకనుకున్నారో ఏమో! ఎందుకంటే గతంలో ఉన్న ఓటుకు నోటు వ్యవహారం కాస్త ముంద రేసారనుకో చంద్రబాబు కు ఈసారి జైలు కూడు తప్పదని అందరికి తెలిసిందే. అందుకే ఇవ్వనని మొండికేస్తే ఇబ్బం దులు పెడతరాని బాబు భయపడ్డారనే చెప్పొచ్చు. కారణమమేదైనా పొలిట్‌ బ్యూరో సమావేశంలో నాయకులు కూడా సచివాలయం భవనాలు ఇచ్చేద్దామన్నారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు హైదరాబాద్‌పై ఇరు రాష్ట్రాలకు సమాన హక్కులు ఉంటాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్‌లో ఉన్న అధికార భవనాలకు వాడుకోవచ్చు. కానీ చంద్రబాబు మాత్రం మూడేళ్లు కూడా సరిగ్గా వాడుకోవడంలేదు. అయినా కేసీఆర్‌ స్కెచ్‌ వేస్తే చంద్రబాబు ఎందీ ఎవ్వరైనా వెళ్లి పోవాల్సిందే. అయితే ఈ క్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఓ ఉత్తమైన సలహనిచ్చారు. సచివాలయ భవనాలు ఊరికే అప్పగించడ మెందుకు? దానికి ప్రతిగా ఢిల్లీలోని ఏపీ భవన్‌ తరహాలో హైదరాబాద్‌లోనూ ఏపీ భవన్‌ నిర్మించి ఇవ్వమని అడుగుదాం. మనోళ్లు ఎవ్వరెళ్లినా వెళితే సౌకర్యంగా ఉంటుంది. దీంతో చంద్రబాబు దానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు సుజనా చౌదరికి అప్పగించారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా హైదరాబాద్‌లో కేసీఆర్‌ ఏపీ భవన్‌ నిర్మించి ఇస్తారా? అన్నది ప్రశ్న. అసలు టీడీపీకీ, చంద్రబాబుకు హైదరాబాద్‌ లోనే కాదు మొత్తం తెలంగాణలోనే లేకుండా చేయాలనుకుంటన్న కేసీఆర్‌ ప్రభుత్వ ఖర్చుతో ఏపీ భవన్‌ కట్టిస్తారంటే నమ్మే విషయమేనా? అదేదో డబుల్‌ బెడ్‌ రూం పథకం కింద కట్టే ఇల్లు కాదు కదా? ఏపీ భవన్‌ కనీసం కొన్ని కొట్లైనా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ముందు మీరు సచివాలయం అప్పగించండి. నేను మీకు ఏపీ భవన్‌ కట్టిస్తానని హామీ ఇచ్చారనుకుందాం. అంతా అయిపోయాక ఏపీ భవన్‌ లేదు. గిపీ భవన్‌ లేదు ఏం చేసుకుంటారో చేసుకొండి అంటే చంద్రబాబు ఏం చేసేది ఏముంటది. ఆ భవనాలు లాక్కోవడానికి కేసీఆర్‌ ఏమైనా చేస్తారు. ఒకవేళ ఏపీ భవన్‌పై హామీ ఇచ్చినా ఇవ్వొచ్చు. అలాంటిదే జరిగితే చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఆయన ఏమీ చేయలేరు. కేసీఆర్‌ మోసం చేస్తే పంచాయతీ కేంద్రం దగ్గరకు వెళుతుందా? ఇప్పటికే కేంద్రం వద్ద చాలాసార్లు మోస పోయినా చంద్రబాబు మళ్లీ మోసపోడని గ్యారంటీ ఏమిటీ. అంటే ఈ విధంగా కూడా చంద్రబాబు అతి త్వరలో మోసపోనున్నారన్నమాట. మరోవైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి దాదాపుగా మూడేళ్లు కావస్తోంది. విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రాలకు హైదరాబాద్‌ రాజధానిగా ప్రకటించారు కేంద్ర సర్కార్‌. కాకపోతే కొత్త ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు 10 సంవత్సరాలు మాత్రమే హైదరాబాద్‌ రాజధానిగా ఉంటుంది. 10 సంవత్సాలలోపు ఎప్పుడైన ఆంధ్రప్రదేశ్‌ తమ సొంత రాజధాని నిర్మించుకుని, హైదరాబాద్‌ను విడిచివెళ్లాల్సి ఉంటుంది. ఇదే ఏపీ పునర్వీభజన చట్టం-2014లో పొందుపరిచివుంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఉమ్మడి రాజధానిగా ఇక తెలంగాణకే సొంత కాబోతుందా? ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌కు బంధం తెగిపోనుందా? అంటే అవుననే వాదన వినబడు తుంది. తొందపాటుతోనో లేక కావాలనునో తెలియదు కానీ పదేళ్లు ఉమ్మడి రాజధాని అవకాశాన్ని ఏపీ సర్కార్‌ చేజార్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా తమ సచివాలయాన్ని పూర్తి స్థాయిలో తరలించింది. తాత్కాలిక సచివాలయంను వెలుగపూడిలో నిర్మించింది. దాదాపు రూ.700 కోట్లతో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం ఒక ప్లాన్‌ ప్రకారం మాత్రం నిర్మించలేదు కానీ పూర్తి స్థాయిలో మాత్రం నిర్మాణం జరిగిందని చెప్పొచ్చు. అయితే చంద్రబాబు ముందుచూపుతోనే కట్టారన్న విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇప్పట్లో ఉండలేం. అంతేకాకుండా చంద్రబాబుకు హైదరాబాద్‌ అచ్చు రావడం లేదని భావనలో ఉన్నారు. ఆయన రెండేళ్ల పాటు హైదరాబాద్‌ను వేదికగా పాలన కొనసాగిస్తే అందులో అవమానాలు, అవహేళనలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక తెలంగాణ రాష్ట్రంతో మనకేం పని అన్న చందంలా వ్యవహారిస్తున్నారు కూడా. ఇకపోతే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం ఎక్కువ శాతం సీమాంధ్రలోనే గడుపుతున్నారు. తెలంగాణపై ఆయన కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. నాకుందుకులే నా రాష్ట్రమా? నా పార్టీ నా? అన్న తీరును ప్రదర్శిస్తున్నారు. ఇదంత జరుగుతున్న క్రమంలో ఆయన యుద్ద ప్రాతిపదికన అధికారులను ఏపీకి రావాల్సిందేనని అదేశాలు ఇచ్చారు. వారికి ఆఫర్ల మీద ఆఫర్లిచ్చారు. రాకపోతే అంతేసంగతులని కూడా బెదిరించారు. రాజు అదేశాలిస్తే వినక తప్పదు కదా! అందుకే ఆగమేఘాల మీద ఏపీ అధికారగణం వెలగపూడి తరిలివస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ సచివాలయంలో ఏపీకి కేటాయించిన బ్లాక్‌లు పూర్తిగా మూగబోయాయి. గత ఆరు దశాబ్దాల కాలంగా ఉంటున్న ఏపీ ఉద్యోగులు, ఫైళ్లు, ఫర్నిచర్‌ తరలిపోవడంతో సచివాలయం పూర్తిగా ఖాళీ అయ్యింది. ఇదే అదునుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ను తెలంగాణకే పరిమితం చేయాలని కేంద్ర హోంశాఖకు, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు విజ్క్షప్తులు చేశారు. మరోపక్క సచివాలయాన్ని కూల్చివేసి, కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, హైద్రాబాద్‌ సెక్రెటేరియట్‌ని ఖాళీ చేసింది గనుక, ఇప్పటి దాకా ఏపీ ఆధీనంలో వున్న సెక్రెటేరియట్‌ భవనాల్ని మాకు అప్పగించండి అంటూ కేసీఆర్‌ కోరారు. అవసరమైతే కొన్ని భవనాల్ని హైద్రాబాద్‌లో ఏపీ కోసం కేటాయించేందుకు సిద్ధం అని గవర్నర్‌కి కేసీఆర్‌ తెలిపారు. అయితే, ఇది సాధ్యమయ్యే పనేనా? అన్న వాదనలు వినబడుతున్నాయి. సచివాలయం తరలి వెళ్ళినా, అసెంబ్లీ విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. అదొక్కటే కాదు, హైకోర్టు విషయంలోనూ వివాదం ఇంకా అలాగే వుంది. ఇంకొన్ని ఉమ్మడి సంస్థల విభజన విషయంలోనూ వివాదాలు కొలిక్కి రాలేదు. దాంతో, ఉమ్మడి రాజధాని అంశంపై కేసీఆర్‌, వ్యూహాలు ఎంతవరకు వర్కవుట్‌ అవుతా యన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఇక్కడ ఒక విషయం మాత్రం సుస్పష్టం. రాజ కీయంగా, చంద్రబాబుపై కేసీఆర్‌ పైచేయి సాధించేందుకోసం మాత్రం ఇలాంటి చర్యలు ఉపయోగపడ్తాయి. పూర్తిస్థాయిలో అమరావతిలో ఏర్పా ట్లు లేకుండా, హైద్రాబాద్‌ నుంచి తరలింపు చేపట్టడంపై ఆల్రెడీ ప్రతిపక్షం నుంచి చంద్రబాబు సర్కార్‌ విమర్శల్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడీ ఉమ్మడి రాజధాని వ్యవహారం, రాజకీయంగా చంద్రబాబుని దెబ్బతీసే అంశమే. అమరావతి మెగా సిటీగా అవతరించడానికి పదిహేనేళ్ళు పడుతుంది అంటూ తాజాగా సెలవిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దాదాపు 32 వేల కోట్ల రూపాయల అంచనాలతో రాజధాని నిర్మాణంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. పూర్తిస్థాయి రాజధాని కోసం కాదు ఈ లెక్క. కేంద్రమేమో వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు అంటోంది రాజధానికి అందించే సహాయం విషయంలో. అలాంటప్పుడు, ఉమ్మడి రాజధాని హైద్రాబాద్‌ నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ హక్కులు వదులుకోవడమెలా సాధ్యమవుతుంది? ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ళలోపు మాయం చేయాలంటే, చట్ట సవరణ జరగాల్సి వుంటుంది. అదేమీ పెద్ద విషయం కాదనుకోండి, అది వేరే సంగతి. ఇప్పటికీ పాలనలో భాగమైన న్యాయ సంబంధ వ్యవహారాలు, వాటిని చూసుకునే ఉద్యోగులు హైదరాబాద్‌లోనే ఉన్నారని, షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన పూర్తి కాకుండా హైదరాబాద్‌ను తెలంగాణకే ఎలా పరిమితం చేస్తారని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అంతేగాక, ఇప్పటికీ రెండు రాష్ట్రాలకూ ఒకే హైకోర్టు ఉందన్న విషయాన్ని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Tags: KCR dreams of eradicating corruption

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *