కేసీఆర్ ఉద్యోగ ప్రకటన భేష్-మాజీ మంత్రి జేసీ
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉద్యోగాల పై చేసిన ప్రకటనపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఒకేసారి ముఖ్యమంత్రి 91 వేల ఉద్యోగాల గురించి చెప్పడం చరిత్రలో మొదటి సారి
అనుకుంటా. దేశంలోనే ఎక్కడ ఎలా జరగలేదు. కచ్చితంగా యూత్ లో ఒక క్రేజ్ వొస్తుంది. పొలిటికల్ ఇంపాక్ట్ కూడా ఈ స్టేట్మెంట్ వల్ల వొస్తుంది. మా ఆంధ్ర లో అసలు డబ్బులే లేవు. జీతలకే డబ్బులు
లేవు ఆంధ్రప్రదేశ్ లో. జగన్ మూడు రాజధానుల ను వదిలేసినట్లే కనిపిస్తుంది. అందుకే బొత్స హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాడని అన్నారు.సీఎం లను కలిసేందుకు ఒకప్పటిలా లేదు. ఇప్పుడు సీఎం లను కలవాలంటే ఆశామాశషీగా లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలుద్దామని వెళ్లిన వీలు కాలేదు. అపాయింట్ మెంట్ ఓకే అయితేపిలుస్తామన్నారు. ఇప్పటి దాకా లేదు. ఏపీ లో అయితే మంత్రులకే సీఎం అపాంట్ మెంట్ ఉండటం లేదని అయన వ్యాఖ్యానించారు.
Tags:KCR Job Advertisement Bhesh- Former Minister Jesse