KCR language change ... CPI Ramakrishna

కేసీఆర్‌ భాష మార్చుకో… సీపీఐ రామకృష్ణ

Date:08/10/2018
విజయవాడ  ముచ్చట్లు:
తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన భాష మార్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సీఎంగా దళితుడిని నియమిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. కనీసం తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ఒక్క దళితుడికి కూడా చోటు కల్పించలేదని ఎద్దేవా చేశారు. ఏపీలో పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నది కేవలం వైకాపా ఎమ్మెల్యేలు మాత్రమేనని ఆరోపించారు.కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకే పని చేయటం దారుణమని దుయ్యబట్టారు. రాజస్థాన్‌లో సీఎం హామీల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్‌ను వాయిదా వేయటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
Tags: KCR language change … CPI Ramakrishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *