మోడీతో కేసీఆర్ భేటీ

Date:15/06/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రధాని మోదీని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారట. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై కూడా లేఖలు ఇచ్చారట. ప్రధానంగా కొత్త జోనల్ వ్యవస్థ, ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్ల అంశం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే రిజర్వేషన్ల పెంపు, బయ్యారం స్టీల్ ప్లాంట్, హైకోర్టు విభజనతో పాటూ విభజన చట్టంలో పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారట. పంటకు మద్దతు ధర పెంపు.. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని కోరారట. మరో రెండు మూడు రోజులు హస్తినలో కేసీఆర్ పర్యటన కొనసాగుతుందని సమాచారం. ఆయన పలువురు కేంద్రమంత్రుల్ని కలిసి.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులపై చర్చించనున్నారు. వాస్తవానికి గత నెలలోనే తెలంగాణ సీఎం ఢిల్లీ వెళ్లారు. అప్పుడే ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరగా.. మోదీ విదేశీ పర్యటన, బిజీ షెడ్యూల్‌తో కుదరలేదు. దీంతో హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి వెంటనే తిరుగు పయనమయ్యారు. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల తర్వాత తొలిసారి కేసీఆర్ మోదీని కలవడంతో.. ఈ భేటీ ఆసక్తిగా మారింది. తాజా రాజకీయాలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
Tags:KCR meeting with Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *