కేసీఆర్ పైఈడీ రైడ్స్ ప్రచారం.
హైదరాబాద్ ముచ్చట్లు:
కేసీఆర్‌ను అరెస్ట్ చేయిస్తాం. జైల్లో పెడతాం. అవినీతి చిట్టా మా దగ్గరుంది. జైలుకెళ్లేందుకు రెడీగా ఉండు కేసీఆర్.. ఇవీ కమలనాథులు పదే పదే చేస్తున్న సవాళ్లు.అంత దమ్ముందా? కేసీఆర్‌ను టచ్ చేసి చూడు.. మీ సంగతి తేలుస్తాం.. అంటూ గులాబీదళం ప్రతిసవాళ్లు.ఆధారాలు ఉన్నాయంటున్నారుగా.. మరి ఇంకెందుకు ఆలస్యం.. అవి బయటపెట్టండి.. వెంటనే కేసీఆర్‌ను అరెస్ట్ చేయించండి.. మధ్యలో రేవంత్‌రెడ్డి మరింత మంట రాజేయడం. కొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయం కేసీఆర్ అరెస్ట్ చుట్టూ తిరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు.. రోజుకోసారైనా కేసీఆర్ ఆరెస్ట్.. జైలు.. గురించి మాట్లాడుతున్నారు. ఆవు-పులి కథలా అవుతుందని.. వన్ ఫైన్ డే.. కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ రైడ్స్ తప్పవంటూ ఆఫ్ ది రికార్డ్ చర్చ అయితే జోరుగా నడుస్తోంది. ఇంతలా హడావుడి చేస్తున్న కమలనాథులు.. ఆ పని చేయకుండా.. ఉత్తగుంటే.. ప్రజల్లో బద్నామ్ కావడం ఖాయం. ఏదో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఇస్తున్న వార్నింగులు కావని.. కేంద్రం నుంచి ఆ మేరకు పక్కా సమాచారంతోనే తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ అరెస్ట్ గురించి ప్రతీసారి ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. లేటెస్ట్గా.. ఢిల్లీలో టాప్ లెవెల్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఓ అప్డేట్ అయితే చక్కర్లు కొడుతోంది. ఈ పార్లమెంట్ సెషన్ ముగిశాక.. తెలంగాణలో కీలక పరిణామం జరగబోతోందని అంటున్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన, కుటుంబ సభ్యుడులాంటి ఓ ఎంపీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్-ఈడీ యాక్షన్‌కు దిగబోతోందని సమాచారం. ముందుగా ఆ ఎంపీపై పంజా విసిరి.. ఆ తర్వాత కేసీఆర్‌ను వలలో చిక్కేలా చేయడం వ్యూహంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. కేసీఆర్ గుట్టుమట్లు.. ఆస్తులు, సంపాదన, అవినీతి, లోటుపాట్లు.. ఆ ప్రగతిభవన్, ఫాంహౌజ్ రహస్యాలన్నీ.. ఇంకా చెప్పాలంటే కేటీఆర్‌కు తెలీని విషయాలు కూడా.. ఆ ఎంపీకి మాత్రమే తెలుసనే పక్కా సమాచారం మేరకే ఆయనపై ఈడీ రైడ్స్ జరగబోతున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్.అవినీతి చెట్లు నాటుతూ.. కాసుల కల్పవృక్షాలను పెంచుతున్న.. ఆ కేసీఆర్ నీడ.. కుమారుడు కాని కుమార్ లూప్పోల్స్పై ఈడీ పూర్తి వివరాలు సేకరించిందని తెలుస్తోంది. అన్ని సాక్షాలు పక్కాగా ఉన్నాయని నిర్థారించుకున్నాకే.. పార్లమెంట్లో గొడవ కాకుండా, చేయకుండా ఉండేలా.. నెక్ట్స్ సెషన్ ముగిశాక.. ఈడీ అటాక్స్ జరుగుతాయని అంటున్నారు. ముందు ఆయన సంతోశాన్ని కార్నర్ చేసి.. ఆ తర్వాత కేసీఆర్ సంగతి చూడాలనేది కేంద్ర దర్యాప్తు సంస్థల ఆలోచన అని ప్రచారం జరుగుతోంది. మరి, ఈడీకి కావలసినంత సరుకంతా.. తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే అందజేశారని.. ముహూర్తం కోసం ఆగుతున్నారని తెలుస్తోంది. అందుకే ఇటీవల సీఎం కేసీఆర్ హడావుడిగా ఢిల్లీ వెళ్లారని.. అయినా లాభం లేకుండా పోయిందని అంటున్నారు. ఆ విషయం తెలిసే.. దమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. అతిత్వరలోనే తెలంగాణలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ తప్పదని తెలుస్తోంది. ముందు, కేసీఆర్ షాడో.. ఆ తర్వాత కేసీఆరే ఈడీ మెయిన్ టార్గెట్ అంటున్నారు.
Tags:KCR PED Rides Campaign