అరవింద్ తో కేసీఆర్ ….

ఊ అంటారా.., ఊఊ అంటారా

హైదరాబాద్  ముచ్చట్లు:

Post Midle

దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని గతంలో ప్రకటించిన గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కేసీఆర్‌ జాతీయస్థాయి పర్యటనలో కీలక భేటీలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఫ్రంట్‌లు కాదు.. ప్రత్యామ్నాయ అజెండా కావాలని అన్నప్పుడే వివిధ పార్టీల నేతలతో సమావేశమై చర్చించారు కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రేతోపాటు ప్రగతి భవన్‌కు వచ్చిన పలు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చలను ముందుకు తీసుకెళ్లారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు తర్వాత వివిధ పార్టీల నాయకులతో సమావేశమైనా.. తాజాగా నిర్వహిస్తున్న భేటీలు మాత్రం చాలా బలమైన లక్ష్యంతోనే సాగుతున్నాయి…అందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ, చండీగఢ్‌ పర్యటనలపై ఆసక్తి నెలకొందిఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీపార్టీ ముందుగా దేశ రాజధాని.. తర్వాత పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది. మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలనే ఆలోచనతో త్వరలో ఎన్నికలు జరిగే వివిధ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్‌ పెడుతోంది. అలాంటి ఆప్‌ చీఫ్‌తో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ అజెండాపై చర్చించే వీలుందా? అనేది ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో దాదాపు 600 మంది రైతులు చనిపోయారు. ఆ రైతు కుటుంబాలకు 3 లక్షల చొప్పుల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు .

 

 

కేసీఆర్‌. ఆ క్రమంలోనే చండీగడ్‌ టూర్‌ పెట్టుకున్నారు. ఈ సందర్భంగానే ఆప్‌ చీఫ్‌తో అజెండాపై చర్చిస్తారని ఒక వాదన.గతంలోనే సీఎం కేసీఆర్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కావాలనుకున్నా వర్కవుట్ కాలేదని ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను వివిధ సందర్భాలలో ఆప్‌ టార్గెట్‌ చేసిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణలోనూ పార్టీని విస్తరించాలని చూస్తోంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. కొంత కసరత్తు కూడా మొదలుపెట్టింది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ అజెండా దిశగా రెండు పార్టీల చర్చలు ఎంత వరకు ముందుకెళ్తాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. గతంలో ప్రగతి భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో సమావేశమైన ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌.. తాజాగా ఢిల్లీలో మరోసారి భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఫోకస్‌ ఆప్‌పై నెలకొంది. మరి.. ప్రత్యామ్నాయ అజెండాపై టీఆర్ఎస్‌తో కలిసి వచ్చే పార్టీల జాబితాలో ఆప్‌ కూడా చేరుతుందో లేదో చూడాలి.

 

Tags: KCR with Arvind ….

Post Midle