Kerala Transport Minister Thomas Chandy resigned on Wednesday

కేరళ రవాణా మంత్రి థామస్ చాందీ రాజీనామా

తిరువనంతపురం ముచ్చట్లు:

కేరళ రవాణా మంత్రి థామస్ చాందీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. భూ ఆక్రమణ కేసులో కేరళ హైకోర్టు ఆగ్రహానికి గురైన ఆయన రాజీనామా చేయక తప్పలేదు. అలప్పుళ జిల్లాలో ఉన్న తన రిసార్టుకు రోడ్డు కోసం పొలాల నుంచి అడ్డంగా రోడ్డు వేయించింది థామస్‌కు చెందిన కంపెనీ. దీనిపై ఆ జిల్లా కలెక్టర్ విచారణ జరిపి థామస్‌కు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేయాలని గత వారమే ఓ విజిలెన్స్ కోర్టు కూడా ఆదేశించింది. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలనీ, తాను మచ్చలేని వ్యక్తిగా ఇందులో నుంచి బయటపడతానని రాజీనామా చేసిన తర్వాత థామస్ అన్నారు. ఒకవేళ కోర్టు తనకు క్లీన్‌చిట్ ఇస్తే తన పదవి తనకు ఇస్తానని సీఎం హామీ ఇస్తేనే రాజీనామా చేస్తానని ముందే థామస్ చెప్పారు.హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తానని ఆయన స్పష్టంచేశారు. గతేడాది మేలో అధికారంలోకి వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వంలో రాజీనామా చేసిన మూడో మంత్రిగా థామస్ నిలిచారు. తనపై ఆరోపణలు వస్తున్నా పదవిని పట్టుకొని వేలాడటంపై సహచర మంత్రులే మండిపడ్డారు. ఇవాళ నలుగురు మంత్రులు కేబినెట్ సమావేశాన్ని కూడా బాయ్‌కాట్ చేశారు.దీంతో థామస్ దిగిరాక తప్పలేదు.

Tag: Kerala Transport Minister Thomas Chandy resigned on Wednesday


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *