సేఫ్ గేమ్ ఆడుతున్న పంజాబ్ కీలక నేతలు

చండీఘడ్ ముచ్చట్లు:
 
పంజాబ్ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలంతా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లే ఉన్నారు. ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేకుండా సమస్యలు తలెత్తకుండా ఎక్కడెక్కడో ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. వివిధ పార్టీల్లోని కీలక నేతల యవ్వారం చూస్తుంటే ముందే తెర వెనుక ఏదో ఒప్పందం చేసుకున్నట్లే జనాలకు అనుమానాలు పెరిగిపోతున్నాయి.పోయిన ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆప్ అధ్యక్షుడు భగవంత్ మాన్ లాంటి వాళ్ళు అకాలీదళ్ లోని పెద్ద లీడర్లతో ముఖాముఖి పోటీ చేయటంతో కొందరు కీలక నేతలు ఓడిపోయారు.బహుశా ఆ అనుభవంతోనే ఇపుడు ముందు జాగ్రత్తలు పడినట్లు కనబడుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో కెప్టెన్ అమరీందర్ సింగ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ భగవంత్ మాన్ చరణ్ జీత్ సింగ్ చన్నీ సుఖ్ బీర్ బాదల్ బిక్రమ్ మజీరియా కీలక నేతలని చెప్పాలి. ముందుగా సిద్ధూ విషయం చూస్తే అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. సిద్ధూ మజీరాలో బిక్రమ్ మజీరియా పైన కానీ పాటియాలలో కెప్టెన్ మీద కానీ పోటీ చేస్తారని అనుకున్నారు.మజీరా సీటులో బిక్రమ మజీరియా పోటీచేస్తున్నారు. ఈయన మీద కాంగ్రెస్ ఆప్ లోని కీలక నేతలు కాకుండా ఇతరులెవరో పోటీచేస్తున్నారు. సీఎం చన్నీ చమ్ కౌర్ సాహిబ్ నుండి పోటీ చేస్తున్నారు. మొదట్లో చన్నీ రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తారని ప్రచారం జరిగినా అధిష్టానం అందుకు అంగీకరించలేదు.
 
 
ఈయనపైన కూడా ప్రతిపక్షాల్లోని కీలక నేతలు పోటీ చేయటంలేదు. కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాల అర్బన్ నుండి పోటీచేస్తున్నారు. గతంలో కెప్టెన్ సిద్ధూపైన పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఎందుకనో అంతా మారిపోయింది.ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపీ అయిన భగవంత్ మాన్ ధురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. 2014 2019లో రెండు సార్లు ఎంపీ గెలిచినపుడు ధుని అసెంబ్లీలో మంచి మెజారిటీ వచ్చింది. అందుకనే ఇపుడు ఇక్కడ నుండే పోటీ చేస్తున్నారు.కాంగ్రెస్ నుండి సిట్టింగ్ ఎంఎల్ఏ దల్బీర్ గోల్డీ అకాలీదళ్ నుండి ప్రకాశ్ సింగ్ గార్గ్ పోటీ చేస్తున్నారు. కాకపోతే మాన్ కు మంచి ఇమేజుంది. అకాలీదళ్-బీఎస్పీ కూటమి అభ్యర్ధి సుఖ బీర్ బాదల్ జలాలాబాద్ నుండి రంగంలోకి దిగారు. బాల్ కు ఈ యోజకవర్గం చాలా గట్టిదనే చెప్పాలి.మొత్తం మీద కీలక నేతలంతా ఎవరు ఎవరి విషయంలోను వేలు పెట్టకుండా జాగ్రత్త పడినట్లు ఉన్నారు.
దాడులను అరికట్టాలి
Tags; Key leaders of Punjab playing the safe game

Natyam ad