శ్రీ బాలాజీ జిల్లా అభివృద్ధికి కిల్లా..!-సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం 

సత్యవేడు ముచ్చట్లు:
 
పరిపాలన సౌలభ్యం.. ప్రజలకు సత్వరమే సేవలు అందించడం.. అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యస్థీకరణ చేసిందని, చారిత్రక నేపథ్యాన్ని.. ప్రజల మనోభావాలను.. స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి.. అన్ని వర్గాలు మెచ్చేలా కొత్త జిల్లాలను ప్రకటన ఉందని, అందులో భాగంగా ఏర్పడ్డా శ్రీ బాలాజీ జిల్లా అభివృద్ధికి ఆలవాలంగా, చారిత్రాత్మక నేపథ్యం, ఆధ్యాత్మిక వాతావరణం, ఆహ్లాదమైన పర్యాటక కేంద్రాలతో పేరెన్నికగన్న వాణిజ్య నగరాలతో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన జిల్లాగా వాసికెక్కిందని, అటువంటి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గాన్ని భాగస్వామ్యం చేయడం తమ నియోజకవర్గం అదృష్టంగా భావిస్తున్నామని, ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు… శనివారం ప్రభుత్వం తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటుకు మద్దతుగా సత్యవేడు నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో విలీనం చేస్తున్నందుకు సంఘీభావంగా నారాయణవనం మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి వైసీపీ శ్రేణులు తో కలిసి సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.
 
 
 
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆదిమూలం స్ధానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…తమ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్ర స్వరూపమే మారిపోయిందని ఇప్పటి వరకు నీటి ఎద్దడి ప్రాంతంగా పేరొందిన రాయలసీమ.. ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం కలిగిన సీమగా మరిపొందుతుందన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటులో భౌగోళికంగా పెను మార్పు చోటుచేసుకొగ ఇప్పటి వరకూ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న కోస్తా జిల్లాలకు మాత్రమే తీర ప్రాంతం ఉండే క్రమంలో రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలకు భౌగోళికంగా సముద్ర తీర ప్రాంతం లేని వైనంలో పరిస్తితులలో ఇప్పుడు సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి బాలాజీ జిల్లాలో కలపడంతో తిరుపతి జిల్లా కోస్తా జిల్లాగా రూపాంతరం చెందిపోతుందన్నారు. అదేవిధంగా క్రిష్ణ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడంపై ఏమీ పాలుపోక టీడీపి శ్రేణులు విమర్శలకు దిగుతున్నారని, దివంగత ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉన్న చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా వాసులకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ పేరు పెట్టారని స్పష్టం చేశారు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, అన్నమయ్య, సత్యసాయి లాంటి వారు ఒక్క ప్రాంతానికి పరిమితమైన వారు కాదని ప్రపంచ వ్యాప్తంగా వారికి గుర్తింపు ఉందని, వారిని గౌరవించుకోడానికే ప్రభుత్వం ఆ పేర్లు పెట్టిందని స్పష్టం చేశారు… ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు జెడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్, ఎంపీపీ దివాకర్ రెడ్డి, సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, మండల అధ్యక్షుడు సొరకాయలు, తదితర వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
 
Tags: Killa for the development of Sri Balaji district ..! – Satyavedu legislators are the origin of Koneti

Natyam ad