గతి శక్తి కార్యక్రమం..

విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ పోర్ట్ సాగరమాల కన్వెన్షన్ హాల్ లో గతిశక్తి కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో పోర్ట్ చైర్మన్ రామమోహన్ రావు,పలువురు పోర్ట్ అధికారులు పాల్గోన్నారు.గతిశక్తి ధ్వారా మరింత ప్రగతి సాధించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని పోర్టు చైర్మన్ రామమోహన్ రావు అన్నారు.11 ఇండస్ట్రియల్ , రెండు డిఫెన్స్ కారిడార్ లు ఏర్పాటు చేస్తున్నారని,200 ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యమని అన్నారు.గ్రామాల్లో సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ రావాలనేది కేంద్రం ఉద్దేశ్యమని,210 కోట్ల రూపాయల వ్యయంతో పోర్ట్ పొల్యూషన్ తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.2023 మార్చి నాటికి క్రూస్ లైన్ అందుబాటులో ఉంటుందని,విశాఖను వచ్చే రెండేళ్ళలో వర్డ్ క్లాస్ పోర్టుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
 
Tags:Kinetic energy program

Natyam ad