అసెంబ్లికి కిరణ్‌ దూరమే..? – ఏపి రాజకీయాలలో అనుమానమే – సొంత నియోజకవర్గాన్ని వదులుకున్నట్టే

అమరావతి ముచ్చట్లు:

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రాజకీయాలలో కీలకపాత్ర, రాష్ట్ర రాజకీయాలలో తమదైన ముద్రవేసిన సమైఖ్యరాష్ట్ర చివరిముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లిలోనికి అడుగుపెట్టే అవకాశాలు లేనట్టుగానే కనిపిస్తోంది. విభజన తరువత సొంత పార్టీ పెట్టి కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితులలో 2014 ఎన్నికల్లో ఘోరపరాజయంపాలైయ్యారు. అక్కడి నుంచి తెరమరుగైన కిరణ్‌ సమీప భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలలో ఆయన పాత్ర ముగిసినట్లే.? పీలేరు సొంత నియోజకవర్గంలో ఆయన సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి కీలకపాత్రకు టీడీపిని వేదికగా ఎంచుకున్నారు. ఇప్పుడు తమ్ముడు అసెంబ్లి పోరుకు సిద్దమైతే , అన్నకిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం నుంచి పోటీకి దూరమైనట్లే. ఇప్పుడు కిరణ్‌ కాంగ్రెస్‌లో చేరుతారా..? లేక ఇలాగే ఉండిపోతారా అన్నది అటు ఉంచితే రాజకీయ భవిష్యత్తును తమ చేతులారా ముగింపు పలుకుతారనేది నమ్మదగినదికూడ కాదు. ఒక వేళ కాంగ్రెస్‌లో తిరిగి చేరినా పీలేరు నుంచి తమ్ముడిపై పోటీకి దిగే పరిస్థితి లేదు. అలాంటప్పుడు సొంత నియోజకవర్గానికి కిరణ్‌ దూరమైనట్టే. అందులోను పీలేరు రాజకీయాలలో ప్రత్యేక్షంగా పాల్గొనే అవకాశాలు ఉండవు. వచ్చే ఎన్నికల్లోగానీ ఆతరువాత కానీ అసెంబ్లికి పోటీ చేయాలంటే మరో నియోజవర్గాన్ని ఎంచుకోవాలి. జిల్లాలో పీలేరు లాంటి నియోజకవర్గం ఆయనకు లేదు. బరిలో నిలిచినా గెలుపు సులువుకాదు. అసలు ఏపి నుంచి అసెంబ్లికి పోటీ చేయాలంటే టీడీపి లేదా వైసిపి నుంచే పోటీ చేయాలి. బలహీన పడిన కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి అవమానపాలైయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎలా చూసినా కిరణ్‌ 2019 అసెంబ్లి ఎన్నికల్లో తన పాత్ర కన్పించే అవకాశం లేదు. ఇదే జరిగితే పీలేరును తమ్ముడు కిషోర్‌కు అప్పగించేసి, రాజకీయాలకు దూరంకావాల్సిందే. ఇలా ఉంటే కిరణ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడి ఉంటున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తును తెలంగాణను వేదికగా చేసుకునే అవకాశాలు లేవని చెప్పలేం. ఎందుకంటే టీడీపీ, టీఆర్‌ఎస్‌లలో ఆయన అత్యంత సన్నిహితులు ఉన్నారు. కాంగ్రెస్‌లోను ఉన్నత స్థాయి నేతలంతా సన్నిహితులే. ఏపి రాజకీయాలకు దూరమైన తెలంగాణలో రాజకీయ పాత్రతో మున్‌ముందు పునాదులు వేసుకునే అవకాశాన్ని కాదనలేని పరిస్థితి . రాజకీయాల్లో క్రీయాశీలంకావాలంటే తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరడమే ఆయనకు ఉన్న ఏకైక దారి. తొలి నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపితో కలిసే పరిస్థితులు ఉండకపోవచ్చు. బిజెపి, టీఆర్‌ఎస్‌లతో కూడ ఇదే దూరం పాటించవచ్చు. కొంత కాలంగా కిరణ్‌ తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, ఏఐసిసి స్థాయి ముఖ్యమైన పదవి కట్టబెడుతారన్న ప్రచారం ఆరు నెలలుగా సాగుతోంది. ఆయన అంతరంగీకులతో జరిపిన ప్రైవేటు సంభషణలో 2019 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఆయనకు అత్యున్నత భవిష్యత్తు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గూటికే మళ్లి చేరవచ్చునని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన ఏపి కంటే తెలంగాణ రాజకీయాలలోనే కీలకపాత్ర పోషించేందుకే ఆసక్తి చూపవచ్చు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో కిరణ్‌ ఎంతో కాలం మౌనంగా ఉండేందుకు వీలులేదు. 2019 ఎన్నికల్లో రాజకీయ వేదికపై తన పాత్రను సుస్థిరం చేసుకుంటారా…లేదా అన్నది ఆయన తెలాల్సిఉంది.

Tag : Kiran away from the assembly – No doubt in politics


 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *