ఆత్మహత్యాయత్నం చేసిన కోహ్లి అభిమాని మృతి

సాక్షి

Date :09/01/2018

రాట్లం: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదు పరుగులకే ఔట్ అయ్యాడనే మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన అభిమాని మృతి చెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లం జిల్లాకు చెందిన 63 ఏళ్ల బాబులాల్ భైరవ విరాట్‌కు వీరాభిమాని. విరాట్ ఆడే మ్యాచ్‌లను  క్రమం తప్పకుండా చూస్తూంటాడు బాబులాల్. ఈ  క‍్రమంలోనే తొలి టెస్ట్ మ్యాచ్ కూడా బాబులాల్ ఒంటరిగా కూర్చొని చూశాడు. అయితే ఈ మ్యాచ్‌లో అదరగొడతాడని భావించిన కోహ్లి కేవలం ఐదు పరుగులు చేసి నిరాశపరిచాడు.దాంతో నిరాశకు గురైన బాబులాల్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఈ ఘటనలో బాబులాల్ తల, చేతులు, కాళ్ల భాగాలు తీవ్రంగా గాయపడటంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.

Tags : Kohli fan killed by suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *