Kohli Sena Christmas gift!

కోహ్లీ సేన క్రిస్మస్ కానుక!

చెన్నై టెస్టులో భారత్ విజయం

Date: 20/12/2017

తమిళనాడు ముచ్చట్లు:

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో జరిగిన క్రికెట్ టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్‌ను 208 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా ఇన్నింగ్స్ 75 పరుగుల విజయంతో సిరీస్‌ను 4-0తో టీమిండియా సొంతం చేసుకొంది. కోహ్లీ సేన విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ విజయంలో కీ రోల్ పోషించిన కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు ఇన్నింగ్స్ ఓటమి తప్పాలంటే 270 పరుగుల స్కోరు చేయాల్సిన ఇంగ్లండ్‌ను భారత లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్‌తో చుట్టిపడేశాడు. ఓపెనర్లు అలీస్టర్ కుక్ 49, జెన్నింగ్స్ 54 పరుగుల స్కోర్లతో ఒకరి వెనుక ఒకరుగా అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది.

Tag: Kohli Sena Christmas gift!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *