Kottappakonda Thirunala

వైభవంగా కోటప్పకొండ తిరునాళ్లు 

Date:13/02/2018
నరసరావుపేటముచ్చట్లు:
గుంటూరు జిల్లా, నరసరావుపేట ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహా శివుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ రోజు స్వామివారికి పలురకాల పూజలు,అభిషేకాల తో స్వామివారిని అలకరించారు.  త్రికోటేశ్వరుణ్ణి కృప తో డాక్టర్ కోడెల శివప్రసాదరావు కోటప్పకొండ ని పలు రకాల అభివరిద్ది పనులు చేసి రాష్ట్రంలోనే కోటప్పకొండ కు ప్రత్యేక స్థానం కలిపించడం లో కోడెల ముందంజలో ఉంటారు, ఎంతగా అభివృద్ధి జరిపారు అని చెప్పుకోవలసి వస్తే కోటప్పకొండ అంటే కోడెల – కోడెల అంటే కోటప్పకొండ అని ప్రజలు చెప్పుకునే విధంగా కోటప్పకొండ ను తీర్చిదిద్దారు.. అలాంటి కోటప్పకొండ మహా శివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వస్తుంటారు. ఆ త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకుని కొరికెలు కోరుకుంటే ఏలాంటి కార్యమైన నెరవేరుతుందని భక్తుల నమ్మకం, ఒకప్పుడు భక్తులు వృద్ధులు, వికలాంగులు, కొండ పైకి చేరుకోవాలంటే ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారు, స్పీకర్ కోడెల అద్వర్యం లో కొండపైకి ఘాటు రోడ్డు నిర్మించి, భక్తుల కు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామి వారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.
అంతే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా కొండపైకి ఎలాంటి వీఐపీ పాస్ లు ఏర్పాటు చేయకుండా స్వయానా ఆంధ్ర రాష్ట్ర శాసనసభపతి ఐన కోడెల శివ ప్రసాదరావు కూడా ప్రభుత్వం చే ఏర్పాటు చేయబడిన ఆర్టీసీ బస్సుల ద్వారా కొండ పైకి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు, అదేవిధంగా నాయకులు అధికారులు కూడా అదే విధంగా బస్సు ప్రయాణం లొనే కొండపైకి చేరుకునే విధంగా ఏర్పాటు చేయడంతో సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేసారు. .మహా శివరాత్రి సందర్భంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డాక్టర్ కోడెల శివప్రసాదరావు త్రికోటేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించారు.. స్పీకర్ కోడెల తో పాటుగా దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, వినుకొండ శాసన సభ్యులు జివి ఆంజనేయులు పాల్గొన్నారు.
Tags: Kottappakonda Thirunala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *