కోవిడ్ వల్ల ఆయుర్వేదానికి విపరీతమైన అభిమానం

– ఎన్ టీ ఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ వివేకానంద
 
తిరుపతి ముచ్చట్లు:
 
కోవిడ్ పరిస్థితుల వల్ల భారతీయ వైద్య శాస్త్ర మైన ఆయుర్వేదానికి ప్రజల్లో విపరీతమైన అభిమానం ఏర్పడిందని ఎన్టీఆర్ వైద్యవిశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ కె వివేకానంద చెప్పారు.
శుక్రవారం ఆయన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన యుజి, పిజి విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. వైద్య విద్యార్థుల మీద గురుతరమైన బాధ్యత ఉందని, వీరు సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వైద్య విద్యార్థులు ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా పల్లె ప్రాంతాల్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా, గ్రామీణ ప్రాంత ప్రజల్లోకి ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని తీసుకుని వెళ్ళ వచ్చునన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, వైద్య విద్యార్ధి చదువు మీద సమాజం ఎంతో ఖర్చు చేస్తోందన్నారు. ఇందుకు ప్రతిఫలంగా సమాజ సేవ చేయాల్సిన బాధ్యత వైద్య విద్యార్థుల మీద ఉందని చెప్పారు. ఎన్ఎస్ఎస్ కార్యమాల్లో పాల్గొనడం ద్వారా వారి బాధ్యతను నెరవేర్చినవారవుతారని చెప్పారు. ఎన్ ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సేవా దృక్పథంతో అలవడుతుందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ తమ కళాశాల ను సందర్శించడం సంతోషమన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పీకే ధూబే, వైస్ ప్రిన్సిపాల్ సుందరం పాల్గొన్నారు.
 
Tags:Kovid is a huge fan of Ayurveda

Natyam ad