- Krishna rule in Chowdhaple police station ....

చౌడేపల్లె పోలీస్‌స్టేషన్‌లో శ్రీక్రిష్ణ పాలన సాగేనా ….?

– నూతన ఎస్‌ఐగా క్రిష్ణయ్య నియామకం

Date:20/06/2018

చౌడేపల్లె ముచ్చట్లు:

చౌడేపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ శ్రీక్రిష్ణ పాలన సాగేనా….అన్న అనుమానం అందరిలోను నెలకొటోంది. చౌడేపల్లె నూతన ఎస్‌ఐగా క్రిష్ణయ్యను నియమిస్తూ ఎస్పి రాజశేఖర్‌బాబు నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఎన్నో ఆరోపణలు కలిగిన పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ పరిపాలన ఎలా ఉంటుందోనన్న ఆత్రుత కన్పిస్తోంది. చౌడేపల్లె ఎస్‌ఐగా గత నెలలో పని చేసిన శ్రీనివాసులు రూ.30 వేలు లంచం తీసుకుంటు ఎసిబి అధికారులకు చిక్కారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐకి, పోలీసులకు మధ్య విబేదాలు తీవ్రంగా ఉండటంతో ఇలాంటి అవినీతి ఎక్కువైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల బోయకొండ గంగమ్మ ఆలయంలో వరుస దొంగతనాలలో పోలీసుల వైఫల్యం స్పష్టమౌతోంది. అలాగే బోయకొండ దిగువప్రాంతంలో వ్యబిచారం, జూదం విచ్చలవిడి గా సాగుతోంది. ఈ చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పోలీసులు ర క్షణ కవచ ంలా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలతో కొంత మంది పోలీసులు తమ విధులను ప్రక్కన పెట్టి, అవినీతే ధ్యేయంగా పని చేస్తున్నట్లు విమర్శిలు ఉన్నాయి. అలాగే చౌడెపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న దొంగతనాలు, ఆస్తి తగాదా కేసులు , భార్య, భర్తల ఘర్షణలలో కూడ బాధితులకు ఎలాంటి న్యాయము లభించలేదని , డబ్బు, పలుకుబడి కలిగిన వారికి మాత్రమే పోలీస్‌స్టేషన్‌ అడ్డాగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. ఈవిషయాలపై పలువురు బాధితులు జిల్లా ఎస్పీ , కలెక్టర్‌ కూడ ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఆదేశించినా , పోలీస్‌స్టేషన్‌లో మాత్రం బాధితులకు న్యాయం జరగకపోవడం గమనార్హం. ఇలాంటి ఎన్నో రకాల విమర్శలతో ఉన్న చౌడేపల్లె పోలీస్‌స్టేషన్‌లో దుష్టశిక్షణ….శిష్టరక్షణ అన్న రీతిలో నూతన ఎస్‌ఐ క్రిష్ణయ్య పరిపాలన సాగిస్తారా…?లేదా అన్న విషయమై ప్రజలు, పోలీసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏది ఎమైనా ప్రస్తుత పరిస్థితులలో చౌడేపల్లె ఎస్‌ఐ పదవి క్రిష్ణయ్యకు ముళ్లకుర్చిగా ఏర్పడింది.

చౌడేపల్లె పోలీస్‌స్టేషన్‌లో క్రిష్ణ పాలన సాగేనా ….?http://www.telugumuchatlu.com/krishna-rule-in-chowdhaple-police-station/

Tags: – Krishna rule in Chowdhaple police station ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *