క్షుద్రపూజలు కలకలం

నల్గొండ ముచ్చట్లు:
సమాజంలో ఆధునికత పెరిగినప్పటికీ.. మారుమూల పల్లెలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మూఢ నమ్మకాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏదో జరిగిపోతోంది. ఏదో రాబోతోందన్న అన్న నమ్మకాన్ని కేటుగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చిలుకూరు చెమ్నారిగూడెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇంట్లో గుంతలు తీసి, పసుపు, కుంకుమలతో పూజలు చేసిన దృశ్యాలు సంచలనంగా మారాయి.సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో చెమ్నారిగూడెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇంట్లో దోషం ఉందని, పూజలు చేయకపోతే ప్రాణ నష్టం కలుగుతుందని నమ్మించి శేషాచార్యులు అనే వ్యక్తి ఈ ఘటనలకు పాల్పడుతున్నాడు. అంతే కాకుండా ఇంట్లో బంగారం అందని, వెలికి తీస్తానని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు. ఇళ్లల్లో గుంతలు తీసి పూజలు చేస్తున్నాడు. తీరా తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. చివరికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
 
Tags: Kshudrapujas are mixed

Natyam ad