కేంద్రం పై  కేటీఆర్ ఫైర్.

న్యూఢిల్లీ ముచ్చట్లు:
యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించే సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘పీఆర్‌ ఎక్సర్‌సైజ్‌’గా వ్యవహరించిందని తెలంగాణ రాష్ట్ర సమితి  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు మండిపడ్డారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల విషయంలో ప్రజాప్రతినిధుల కసరత్తుపై కేటీఆర్‌ శుక్రవారం ట్విటర్‌ వేదికగా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దయ వల్లేప్రాణాలు రక్షించబడ్డాయని ఉక్రెయిన్ నుంచి తరలించిన విద్యార్థులకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెబుతున్న వీడియోను ఆయన పోస్ట్ చేశారు.గురువారం ఢిల్లీ సమీపంలోని హిందాన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ఎయిర్‌క్రాఫ్ట్‌లో అజయ్ భట్ సంభాషించారు. వీడియో క్లిప్‌లో ‘మోదీ జీ జిందాబాద్’ అనే నినిదాలు చేశారు విద్యార్థులు. కాగా, ఉక్రెయిన్‌-రష్యా వార్‌ కారణంగా భారతీయులు ఉక్రెయిన్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. వారిని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాల ద్వారా చర్యలు చేపడుతోంది. ఇక్కడ చిక్కకుపోయిన ఎంతో మంది విద్యార్థులు, పౌరులను భారత్‌కు తీసుకువచ్చారు. పెరిగిన విమానాల సంఖ్య ఉక్రెయిన్ నుండి దాటి వచ్చి ఇప్పుడు పొరుగు దేశాలలో ఉన్న భారతీయుల సంఖ్య పెరిగిపోయింది. ఇక రాబోయే 2 3 రోజుల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తారని కేంద్రం తెలిపింది.
 
Tags:KTR fire on center
 

Natyam ad