Kurnool is a huge scene in Krishnanagar

కర్నూలు కృష్ణానగర్‌లో భారీ చోరీ

Date:13/01/2018

– కిలో బంగారం, రూ.4 లక్షల నగదు అపహరణ

కర్నూలు క్రైం ముచ్చట్లు:

దొంగల భయంతో ప్రజలు హడలిపోతున్నారు. కర్నూలులోని కృష్ణా నగర్లో రవీంద్ర స్కూల్‌ వెనుక వైపు రైల్వే ట్రాక్‌ ఎదురుగా ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పిల్లల ఫీజుల కోసం దాచి ఉంచిన నగదును దోచుకెళ్లారని బాధితురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి నెల్లూరుకు వెళ్లడంతో ఘటన జరిగిందన్నారు. ఉదయం పక్కింటి వారు గుర్తించడంతో చోరీ వ్యవహారం బయటపడిందని తెలిపారు. ఈ మేరకు నాల్గొవ పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

Tags : Kurnool is a huge scene in Krishnanagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *