కన్నులపండువగా లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె ముచ్చట్లు:
రాష్ట్రంలో ప్రముఖ రెండవ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతూ, , కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి గాంచిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానములో రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ ఆధ్వర్యంలో మాఘ మాసంలో జరిగే లక్ష కుంకుమార్చన కార్యక్రమం రెండవ రోజు ఆనగా 24-02-2022 వ తేదీన ఘనంగా నిర్వహించారు. పూజలలో 149 మంది దంపతులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి, ధర్మకర్తల మండలి సభ్యులు పూర్ణిమ రాయల్ మోహన్, శ్రావణి భాను ప్రకాష్, ఈశ్వరమ్మ, ఆలయ వేదపండితులు, ఆలయ అర్చకులు గంగిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Laksha Kunkumarchana as eye-catching