బోయకొండలో కన్నుల పండువగా ముగిసిన లక్ష కుంకుమార్చన పూజలు

–పూజల్లో పాల్గొన్న302 దంపతుల జంటలు
–వేదపండితులచే ప్రత్యేక పూజలు
–భక్తుల రద్దీతో కిటకిటలాడిన ఆలయం
 
చౌడేపల్లె ముచ్చట్లు:
 
జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రతి యేటా మాఘమాసం నెలలో అత్యంత వైభవంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన పూజలు శుక్రవారం తో కన్నుల పండువగా ముగిశాయి. ఈ సంధర్బంగా వేద పండితులు,అర్చకుల మంత్రోచ్చరణల మద్య ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ మూర్తికు ప్రత్యేక పూజలు చేసి దంపతులకు పూజా సామాగ్రిను అందజేశారు.అమ్మవారి ఉత్సవ మూర్తి ఎదుట ప్రత్యేక పూజలు, గణపతి, చంఢిహ్గమం, పూర్ణాహుతి, మహా మంగళహారతి చేశారు. అంతకుమునుపే రూ:1116 చెల్లించిన ఉభయదారుల దంపతులకు వేద పురోహితుల మద్య దంపతులిద్దరిచే అమ్మవారి సన్నిదిలో పూజలు చేయించారు..ఈ పూజా కార్యక్రమానికి సుమారు302 జంటల దంపతులు హాజరై కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. బోయకొండ ఆలయం వద్ద పూజల్లో పాల్గొనే దంపతులే కాకుండా వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో రద్దీ గా నెలకొంది.పూజా కార్యక్రమాల అనంతరం ఉభయదారులకు తీర్థప్రసాదాలను దంపతులకు అందజేశారు.
భక్తిశ్రద్దలతో రాహుకాల అభిషేక పూజలు……
 
బోయకొండ అమ్మవారికి ప్రతి శుక్రవారం నిర్వహించే రాహుకాల అభిషేక పూజలను భక్తిశ్రధ్దలతో చేపట్టారు. రాహుకాల సమయంలో అమ్మవారికి పూజలు చేసి వెహోక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో పాలక మండళి సభ్యులు వెంకటరమణారెడ్డి, పూర్ణిమ, శ్రావణి, ఈశ్వరమ్మ తదితరులున్నారు.

Tags; Laksha Kunkumarchana Pujas which ended as a festival of eyes in Boyakonda

Natyam ad