Lalu does not like to be in that jail

ఆ జైలులో ఉండడం ఇష్టం లేదన్న లాలూ

-వేరే కారాగారానికి మార్చాలని కోర్టుకు వినతి

Date: 13/01/2018

దుమ్కా ముచ్చట్లు:

దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాద‌వ్‌తో పాటు పలువురు హజారీభాగ్‌లోని ఓపెన్‌ జైల్లో శిక్ష అనుభవించాలని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశించిన నేపధ్యంలో దుమ్కా జిల్లా ట్రెజరీ కేసు విచారణ సమయంలో లాలూ జడ్జిని ఓ కోరిక కోరారు. తనకు ఆ ఓపెన్‌ జైలులో ఉండడం ఇష్టం లేదని చెప్పారు. ఆ జైలులో అక్కడ కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఉండొచ్చని జడ్జి అన్నారు. జడ్జి సమాధానంపై స్పందించిన లాలూ ఆ జైలు నక్సలైట్ల కోసం కేటాయించినదని, దయచేసి ఓపెన్‌ జైలు నిబంధనలు చూడాలని జడ్జితో అన్నారు. 60 ఏళ్ల పైబడిన వారు, ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడిన వారిని అక్కడ ఉంచుతారని, శిక్ష పడిన వారి ఇష్టప్రకారమే ఆ జైలులో ఉంచాలని లాలూ అన్నారని తెలిసింది. కాగా, దాణా కుంభకోణం కేసులో దోషులుగా తేలిన వారు పశువులకు దాణా, ఔషధాలను సరఫరా చేయడంలో నిపుణులని, అందుకే డెయిరీ అభివృద్ధికి ఉపయోగపడతారని వారిని ఓపెన్‌ జైలుకు పంపిస్తున్నాయని అప్పట్లో తీర్పు సమయంలో జడ్జి చెప్పారు.

Tags: Lalu does not like to be in that jail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *