సదుం మండలంలో భారీ స్థాయిలో సారా ఊట ధ్వంశం.

పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం జోగి వారి పల్లె పంచాయతీలోని బోడి గుట్ట వద్ద సారా ఊటను భారీ స్థాయిలో ధ్వంసం చేసినట్టు ఎస్సై ధరణీధర వెల్లడించారు. ఎస్ఐ వివరాల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో బోడిగుట్ట లో పది కిలోమీటర్ల మేర కార్టన్ చర్చ్ నిర్వహించామన్నారు. ఈ దాడులలో పదహైదు వేల లీటర్ల సారా తయారీ ఊట ధ్వంసం చేసి తయారీకి ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సారా తయారీ చేసినా, విక్రయించినా నేరమని ఇందుకు పాల్పడే వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన తెలియజేశారు. అలాగే  విధులలో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు.
 
Tags:Large-scale destruction of Sara Oota in the Sadum Zone

Natyam ad