స్కూటీని ఢీకొన్న లారీ, ఇద్దరు పీజీ విద్యార్థినులు మృతి

Date : 23/12/2017
మేడ్చల్ముచ్చట్లు:   
శామీర్ పేట మండలం అలియాబాద్ దగ్గర శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్ధినులు మృతిచెందారు. ప్రణవి, వీణ అనే ఇద్దరు విద్యార్ధినులు జగన్గూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో పీజీ చదువుతున్నారు. అయితే… వారు స్కూటీపై వస్తూ రోడ్డు దాటుతుండగా లారీ వీరి స్కూటీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా… భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెంచుకున్న వీరు ఉన్నత చదువులు చదువుతూ ఇలా అర్ధాంతరంగా తనవులు చాలిచడం పట్ల వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
Tags : Larry and two pediatrician students collided with a scooter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *