ఇద్దరు యువకులను ఢీకొట్టిన లారీ

Date: 11/12/2017
దేవరకద్ర ముచ్చట్లు:
ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను లారీ ఢీకొట్టిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన అశోక్(20) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంకటేశ్ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణచేపట్టారు.
Tag: Larry collided with two young men

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *