మూగజీవాలపైకి దూసుకొచ్చిన లారీ.. 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి.

కర్నూలు ముచ్చట్లు:
జిల్లాలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని భద్రతా ప్రమాణాలు తీసుకుంటున్నా ప్రజలు పట్టించుకోకపోవడంతో రోజుకో ప్రమాదం చోటుచేసుకుంటున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదం జరగడం, జనాలు చనిపోవడం రివాజుగా మారుతున్నది. తాజాగా బుధవారం తెల్లవారుజామున కంకర లోడుతో వస్తున్న టిప్పర్.. 40 వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 గొర్రెలు కాళ్లు విరిగి చావుబతుకుల్లో ఉన్నాయి.వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గన పల్లి గ్రామానికి చెందిన 10 మంది కాపరులు 3 వేల గొర్రెలను మేత కోసం రాయమాలుపురం తీసుకెళ్లేందుకు మంగళవారం రాత్రి బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున జాతీయ రహదారి వెంట గొర్రెలను తోలుకుంటూ వస్తూ బలపనూరు మెట్ట సమీపంలో ఉన్న మైదానంలో గొర్రెలను నిలుపుకోవడానికి రోడ్డు దిగారు. అదే సమయంలో తమరాజుపల్లిలో కంకర లోడ్ చేసుకొని నంద్యాల వైపు వెళ్తున్న టిప్పర్ వేగంగా దూసుకొచ్చి గొర్రెల మందను ఢీకొట్టింది. దాంతో దాదాపు 20 గొర్రెలు టిప్పర్‌ టైర్ల కింద పడి చనిపోయాయి. మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 
Tags:Larry crashes into dumb creatures .. 20 sheep die on the spot

Natyam ad