మునిసిపల్ కార్మికుని డీ కొట్టిన లారీ.

రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
వేములవాడ మునిసిపాలిటీ కార్మికునిగా విధులు ముగించుకొని బైక్ పై  ఇంటికి వెల్లుతున్న పందుల వంశీ ని వేగంగా వస్తున్న లారీ డీ కొట్టింది.   బైక్ పై ఉన్న వ్యక్తి  ఆక్కడికక్కనే మృతి చెందాడు. పోలీసులు అతి ఉత్సాహం తో ఐదు నిమిషంలో మృతి చెందిన బాడీని, లారీని తరలించారు. ఎలాంటి పంచనామా చేయకుండా, బంధువులకు సమాచారం ఇవ్వకుండా శవాని తరలించడం పై ఆగ్రహించిన బంధువులు పొలిస్టేషన్ ముందు ధర్నా చేపట్టారు.  నా కొడుకును నాకు చూపించమని  పొలిసు స్టేషన్ ముంది తల్లి రోదించడం తో అక్కడి వారిని కన్నీరుపెట్టించింది. చివరకు బంధువులు పోలీస్ జులుం నశించాలి,  లారీ ఎక్కడికి తరలించారని,  ఎందుకు మాకు సమాచారం ఇవ్వలేదంటూ నినాదాలు చేశారు. మృత్యుడు మునిసిపాలిటీ కార్మికుడు కావడం తో మునిసిపాలిటీ కార్మికులు అందరు పొలిస్టేషన్ ముందు ధర్నా చేపట్టారు, కార్యాలయ  చెత్త ట్రాక్టర్లు తెచ్చి రోడ్డుకు అడ్డం పెట్టారు.  మృతుడి సొంత గ్రామం వేములవాడ లక్ష్మీపూర్. కొన్ని రోజుల ముందే  కూతురు పుట్టింది.  శివరాత్రి జాతర సందర్బంగా శానిటేషన్ లో విధులు నిర్వహించుకొని ఇంటికి వెల్లుతున్న కార్మికుని వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడనే మృతి చెందడం జరిగిన పోలీసులు అతి ఉత్సాహం తో బంధువులకు సమాచారం ఇవ్వకుండా శవాని, లారీని తరలించడం పట్ల ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
 
Tags:Larry hitting dee with municipal worker

Natyam ad