లారీ,బైక్ ఢీ కొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి
నెల్లూరు ముచ్చట్లు:
జిల్లాలోని కోట మండలం లారీ,బైక్ ఢీ కొన్న ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కసుమూరు కోటయ్య(47),ఇతనిది చిల్లకూరు మడలం అన్నంబాక గా గుర్తించారు. మృతుడు కోట నుండి సొంత గ్రామం అన్నంబాక వస్తుండగా లారీ గూడూరు నుండి విద్యానగర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన కోటయ్య ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న కోట ఎస్సై పుల్లారావు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించి విచారణ చేస్తున్నారు.
Tags; Larry, man killed in bike crash