జనవరి 27న పంచగవ్య ఉత్పత్తుల ప్రారంభం

– అందుబాటులోకి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్రపటాలు,ఇతర వస్తువులు
– ఉద్యోగులకు నగదు రహిత వైద్యం పైఎంఓయు లు
 
తిరుపతి ముచ్చట్లు:
 
కోయంబత్తూరు కు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సాంకేతిక సహకారం తో టీటీడీ తయారు చేయించిన 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను జనవరి 27 వ తేదీ ప్రారంభించనున్నారు.తిరుపతి డిపి డబ్ల్యూ స్టోర్స్ ఆవరణంలో ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వీటిని ప్రారంభిస్తారు.టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేసిన శ్రీవారు, అమ్మవారి చిత్రపటాలు ఇతర ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తేనున్నారు.టీటీడీ ఉద్యోగులకు తిరుపతి లోనే కాకుండా చెన్నై, బెంగుళూరు మహా నగరాల్లోని కొన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించే ఒప్పందాలు చేసుకుంటారు.
దాడులను అరికట్టాలి
Tags: Launch of Panchagavya Products on January 27

Natyam ad