పట్రపల్లెలో న్యాయవిజ్ఞాన సదస్సు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని పట్రపల్లె గ్రామంలో న్యాయవిజ్ఞాన సదస్సును శనివారం పుంగనూరు అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సిందు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలపై మండల్ లీగల్ సర్వీసస్ అథారిటికి ఫిర్యాదు చేయాలన్నారు. దీనిపై సంబంధిత అధికారులకు , వ్యక్తులకు నోటీసులు జారీ చేసి , సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వెంకటరెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags; Law Conference at Patrapalle