Laxmareddy Mummati Munnabhai RMPine: Revant

లక్ష్మారెడ్డి ముమ్మాటికీ మున్నాబాయ్ ఆర్ఎంపీనే: రేవంత్

Date: 08/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మరోసారి రేవంత్ లక్ష్మారెడ్డి ముమ్మాటికీ మున్నాబాయ్ ఆర్ఎంపీనే అని పేర్కొన్నారు. లక్ష్మారెడ్డికి హెచ్‌కేఈ కళాశాల ప్రిన్సిపల్ సంపత్ ఇస్తున్న వత్తాసు సరైనది కాదని అన్నారు. ‘‘1985 వరకు కళాశాలకు సీసీహెచ్ అనుమతి లేదని సంపత్ చెబుతున్నారు. మరి అనుమతి లేని కళాశాలలో చదవిన చదువు ఎలా చెల్లుతుంది’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘గుల్బర్గా యూనివర్సిటీకి 1990లో అనుమతి వచ్చింది. మరి ఆ వర్సిటీ నుంచి 1988లో లక్ష్మారెడ్డి ఎలా పాసయ్యారు?’’ అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని రేవంత్ స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ సభలో రేవంత్ లక్ష్మారెడ్డి నకిలీ డాక్డర్ అని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై లక్ష్మారెడ్డి కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

Tags: Laxmareddy Mummati Munnabhai RMPine: Revant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *