Laying the foundation stone for the GALLA-KUMAR WELFARE BUILDING

గొల్ల-కుర్మల సంక్షేమ భవన సముదాయానికి శంకుస్థాపన

Date: 30/12/2017

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కేసీఆర్: మంత్రి జోగు

హైదరాబాద్‌ ముచ్చట్లు:

కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనాల సముదాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం, మంత్రి ప్రసంగించారు. తెలంగాణలో శాతం బీసీ జనాభా ఉన్నారని, బీసీల కోసం సీఎం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి ఉద్ఘాటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడున్నరేళ్ల కాలంలో అట్టడుగు వర్గాలను గుర్తించి సీఎం ఆదుకుంటున్నారని తెలిపారు. బీసీలోని అన్ని ఉప కులాలకు ప్రత్యేకంగా సీఎం నిధులు కేటాయిస్తున్నారు. గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు. కానీ వారి అభివృద్ధి గురించి పట్టించుకున్న వారెవరూ లేరని స్పష్టం చేశారు. బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ హాస్టల్ వసతి కల్పిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో బీసీలు గౌరవంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని కోకాపేటలో ఈ భవనాల సముదాయానికి రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారీ స్థాయిలో గొల్ల, కుర్మలు పాల్గొన్నారు.

Tag: Laying the foundation stone for the GALLA-KUMAR WELFARE BUILDING

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *