Leaders of Telugu Desam Party of YSRCPP

వైఎస్సాఆర్సీపి తీర్థం పుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు

Date:13/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం పట్రపల్లి పంచాయతీ ఎర్రగుంట్లపల్లికి చెందిన తెలుగుదేశ ం పార్టీకి చెందిన సుమారు 20 మంది నాయకులు, కార్యకర్తలు పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సాఆర్సీపిలో చేరారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలసి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, తెలుగుదేశం నాయకులు చిన్నబుడ్డప్ప, బి.మణి, పి.మునస్వామి, పాపన్న, రెడ్డెప్ప, బి.మహేష్‌ , సురేష్‌, వి.కుమార్‌, బి.శ్రీకాంత్‌, ఏ.రమేష్‌, ఏ.రమణ, జి.సోమశేఖర్‌, బి.మునిరత్నం, ఎం.రవి, ఏసి.శ్రీనివాసులు, ఎల్‌.పెద్దబుడ్డన్న లకు వైఎస్సాఆర్సీపి కండువాలు కప్పి, పార్టీలోనికి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న సేవలను గుర్తించి తాము పెద్దిరెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు పార్టీలో చేరామన్నారు.

 

వైఎస్సాఆర్సీపి తీర్థం పుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ నేతలుhttp://www.telugumuchatlu.com/leaders-of-telugu-desam-party-of-ysrcpp/

Tags; Leaders of Telugu Desam Party of YSRCPP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *