తోవి దుర్గమ్మ అవ్వను దర్శించుకున్న తెలుగుదేశం నాయకులు
కౌతాళం ముచ్చట్లు:
కౌతాళం మండలం లోని తోవి గ్రామంలో వెలసిన శ్రీ దేవమ్మ అవ్వ నూతన విగ్రహప్రతిష్ఠా కు హజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుధీర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్, జిల్లా బి సి సంఘం కార్యదర్శి కురుగోడు,పాల్గొన్నారు.వారికి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి శ్రీ దుర్గమ్మ అవ్వ విగ్రహం కు ఇరవై వేలు రూపాయిలు నాయకుల చేతుల మీద విరాళాంను స్ధానిక పెద్దలకు అందజేశారు. వారికి గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువా పూలమాల వేసి సన్మానించారు అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాదించి ప్రసాదం ను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజానంద్, తోవి నాయకులు శంకర్, సోమేష్, గణేష్, రుద్రప్ప, నారాయణ, తెలుగు యువత విజయ్, అంజీ తదితరులు పాల్గొన్నారు.
Tags: Leaders of Telugudesam visit Tovi Durgamma Avva