విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీలు ఆందోళన

విశాఖపట్టణం ముచ్చట్లు:
 

విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ సోమవారం విశాఖలోని ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్లాబులో మార్పులు చేస్తూ విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిపాదనలు చేసిందని, ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానిదేనని, సామాన్యులపై మరింత భారం పెరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు విశాఖ ఈపీడీసీఎల్ కార్యాలయంలో విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. రాష్ట్రంలో అన్ని విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి అధికారులు హాజరయ్యారు. వర్చువల్ విధానం ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నుంచి 27వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.
దాడులను అరికట్టాలి
Tags; Left parties are worried about protesting the hike in electricity charges

Natyam ad