ప్రతి ఒక్కరు పనిచేయండి -ఎంపీ మిధున్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో ఇంటింటికి కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లను ఆదే శించారు. కౌన్సిలర్లు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కలసి తమ పరిధిలోని ప్రతి చిన్న సమస్యను గుర్తించి నివేదికలు సిద్దం చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలను అర్హులైన పేదలందరికి అందేలా పని చేయాలన్నారు. అలాగే వార్డుల్లో మౌళిక వసతులు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించినా, అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షమమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ పర్యటనలో రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్‌.లలిత, రాష్ట్ర కురబసంఘం అధ్యక్షుడు జబ్బాల శ్రీనివాసులు, రాష్ట్ర కాపుయువజన సంఘ అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Let everyone work -MP Midhunreddy

Natyam ad