బిజేపీపై వైసీపీ వైఖరిని స్పష్టం చేయాలి: సీపీఎం మధు

DAte:13/02/2018
విజయవాడ ముచ్చట్లు:
భారతీయ జనతా పార్టీపై వైసీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ స్పందిస్తోన్న తీరును ఆయన తప్పుబట్టారు. సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా మధు రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని, అలాగే పోలవరం నిర్మాణానికి ఇంకా నిధులు రావాల్సి ఉందని మధు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఉద్యమిస్తామని చెప్పారు. తాము ఇటీవల నిర్వహించిన బంద్‌కు వైసీపీ మద్దతును కోరామని, అయితే ఆ పార్టీ సరిగ్గా స్పందించలేదని చెప్పారు.
Tags: Let’s clarify the attitude of the VCP on the BJP: CPM Madhu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *