వృక్షాలను రక్షిద్దాం-ప్రాణులకు ఆక్సిజన్ ఇస్తాం.

బద్వేలు ముచ్చట్లు:
బద్వేల్ పట్టణంలో సోమవారం మానవ సంక్షేమ సంఘం,పూలే ఆశయసాధన బి సి సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వృక్షాలను కాపాడి క్రొత్త మొక్కలను నాటి ప్రాణులకు ఆక్సిజన్ మరియు పర్యావరణాన్ని కాపాడుదాం అని బద్వేల్ రెవిన్యూ డివిజనల్ అధికారి,బద్వేలు మండల తహశిల్దారు,బద్వేల్ మండల అభివృద్ది అధికారి,బద్వేల్ మునిసిపాలిటీ కమిషనర్ మరియు మునిసిపాలిటీ ఛేర్మెన్ గార్లకు వినతిపత్రాలు ఇవ్వడమైనది.ఈ సందర్భంగా బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ మానవులతోపాటు ప్రాణులన్నీసంపూర్ణ ఆరోగ్యంతో  జీవించడానికి గాలిలో ఆక్సిజన్ అధిక శాతం వుండాలి పర్యావరణం కూడా పరిశుభ్రంగా వుండాలి అందుకు వున్నక్షాలను కాపాడుకుంటూ క్రొత్త చెట్లమొక్కలను నాటాలి.బద్వేలు పట్టణంలో ఇళ్ళముందు ప్రభుత్వ స్థలాలలో వుండే పెద్ద వృక్షాలను నరికి రోడ్డు స్థలాలో ఇల్లు,కాంపౌండు గోడలను కట్టుకొని పర్యావరణాన్ని పాడుచేస్తూ వీధి రోడ్లలో వాహనాలు తిరగడానికి ప్రజలు అనేక కష్టాలపాలవుతున్నారు.గ్రామాలలో కూడా యధేచ్చగా వృక్షాలను నరికేయడంవల్ల గ్రామాల పట్టణాలలోని ప్రజలు అనేక రకాల వ్యాధులబారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.2019 లో వచ్చిన కరోనా వ్యాధిగ్రస్థులకు ఆక్సిజన్ దొరక్క లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రాణాలను కాపాడుకోలేకపోయాం.ప్రస్తుతం వున్న వృక్షాలను కాపాడుకుంటూ నూతన చెట్ల మొక్కలను నాటు బాధ్యత సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటూ సమాజాన్ని చైతన్యంచేయాలన్నారు.ముఖ్యంగా బద్వేల్ పట్టణంలోని వృక్షాలను గుర్తించి వాటికి వరుస నంబర్లు ఇచ్చి రికార్డుల్లో పొందుపరచి వృక్షాలను కాపాడాలన్నారు.
 
Tags;Let’s protect the plants – give oxygen to the living beings

Natyam ad