తిరుపతి అభివృద్ధికి శ్రమిద్దాము – ఎమ్మెల్యే భూమన

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతి అభివృద్ధికి శ్రమించి,ప్రజా సౌకర్యాలను కల్పించేందుకు పనిచేద్దామ‌ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు.తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిదిలోని 2వ డివిజన్లో రేణిగుంట రోడ్డు నుండి తిరుచానూరును కలిపే రహదారిని 60 అడుగుల రోడ్డుగా వెడల్పు చేసే పనులను సోమవారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ గిరీషాలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ తిరుపతిలోని ప్రజలకు సౌకర్యవంతమైన, వెడల్పాటి రోడ్లను తీసుకురావడం వలన దూర భారం తగ్గడంతో పాటు, విశాలమైన రోడ్లతో ట్రాఫిక్ ను నివారించవచ్చని తెలిపారు.రేణిగుంట రోడ్డు నుండి తిరుచానూరు హైవే రోడ్డును కలుపుతున్న ఈ రహదారిని 60 అడుగుల వెడల్పుతో కొత్త రోడ్డును వేయడం వలన వాహనదారులకు అనుకూలంగ వుండడంతోబాటు రెండవ డివిజన్ మరింత అభివృద్ది చెందుతుందని భూమన కరుణాకర రెడ్డి అన్నారు.తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ గిరీషా ఐఏఎస్ మాట్లాడుతూ 3.50 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ రహదారి పూర్తి అయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడమే కాకుండ,ఇక్కడి ప్రజలకి సౌకర్యవంతంగా వుంటుందన్నారు.ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ ఉమాఅజయ్, సూపరిండెంటెంట్ ఇంజనీర్ మోహన్,మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ విజయకుమార్ రెడ్డి,2వ డివిజన్ వైసిపి అధ్యక్షులు అజయ్ కుమార్, కాంట్రాక్టర్లు జనార్ధన్ రెడ్డి,వెంకటముని రెడ్డి పాల్గొన్నారు.
 
Tags: Let’s work for the development of Tirupati – MLA Bhumana

Natyam ad