పార్టీ గెలుపుకోసం కృషిచేద్దాం – వైసీపీ నేత అకుల గజేంద్ర రాయల్

పెద్దపంజాణి ముచ్చట్లు:
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలమనేరు నియోజకవర్గ నేత ఆకుల గజేంద్ర రాయల్ పిలుపునిచ్చారు. పెద్దపంజాణి మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ బాగారెడ్డి ఆద్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల గజేంద్ర మాట్లాడుతూ పార్టీ గెలుపే ప్రధాన లక్ష్యంగా క్షేత్ర స్థాయినుంచి ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేసి నియోజకవర్గ గెలుపును పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఈ నెల 11 న పలమనేరు పట్టణంలో వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంబించనున్నట్టు ఆయన తెలిపారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు అందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు శంకరప్ప, వైస్ ఎంపీపీ సుమిత్ర, జిల్లా కార్యదర్శి తమ్మిరెడ్డి, ఎస్సీ సెల్ కార్యదర్శి రవి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, బోయకొండప్ప, చెన్నారెడ్డి, బాలాజి, క్రిష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
Tag : Let’s work for the party to win – VCP leader Akula Gajendra Roy


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *