“మధురపూడి గ్రామం అనే నేను” సినిమా నుంచి ‘లింగా లింగా..’ లిరికల్ సాంగ్ విడుదల.

సినిమా ముచ్చట్లు:
శివ కంఠమనేని,క్యాథలిన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా “మధురపూడి గ్రామం అనే నేను”. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు.కల్యాణ్ రామ్ కత్తి ఫేమ్ మల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా “మధురపూడి గ్రామం అనే నేను” సినిమాలోని ‘లింగా లింగా నీరైన గంగా..’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. శివతత్వాన్ని చెప్పే ఈ పాట ఆధ్యాత్మిక  భావనతో ఆకట్టుకుంటోంది.
మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటకు పరిమి కేదరనాథ్ సాహిత్యాన్ని అందించగా..సాయికుమార్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే..లింగా లింగా నీరైన గంగ..గంగ తడిసిన శిలలు శివుని రూపంగా..జన్మకో లీలలు, కర్మ పాశంగా..ధన్యమౌ జీవులు నిన్ను తెలియంగా..లింగా లింగా నీరైన గంగ..గంగ తడిసిన శిలలు శివుని రూపంగా..అంటూ సాగుతుందీ పాట. శివలీలను గుర్తుచేస్తూ రాసిన పాటగా తెలుస్తోంది.
 
Tags:’Linga Linga ..’ Lyrical song release from the movie “Madhurapudi Gramam Ane Nenu”.

Natyam ad