ఇక ట్రైన్ మేనేజర్

ముంబై ముచ్చట్లు:
 
రైల్వే గార్డ్.. ఈ పేరు చాలాసార్లు వినే ఉంటారు కదూ. రైలు చివరి పెట్టె ద్వారం వద్ద తెల్లని ప్యాంట్, షర్ట్ వేసుకుని, చేతిలో పచ్చజెండా పట్టుకుని ఓ వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తిని రైల్వే గార్డ్ అంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి పేరును మార్చింది ఇండియన్ రైల్వే. రైల్వే గార్డును.. ట్రైన్ మేనేజర్ గా చేసింది. ఇండియన్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చేసింది. ఇకపై అందరూ ట్రైన్ మేనేజర్ అనే పిలవాల్సి ఉంటుంది.గార్డ్ అంటే రక్షకుడు, కాపలాదారుడు అనే అర్థాలు స్ఫుర్తిస్తాయి. కానీ రైల్వే గార్డ్ సేవలు అంతకుమించి ఉంటాయి కాబట్టి.. విధుల నిర్వహణలో వారిలో మరింత ప్రేరణ కలిగించేలా.. వారి పేరులో రైల్వే శాఖ ఈ మార్పును తీసుకొచ్చింది. పేరులో తప్పించి, వేతనాలు, బాధ్యతల్లో ఎలాంటి మార్పు ఉండదని భారతీయ రైల్వే స్పష్టం చేసింది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Longer train manager

Natyam ad