బైక్ ను ఢీ కొట్టిన లారీ….ఇద్దరు యువకుల దుర్మరణం.
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వరంగల్- ఖమ్మం హైవేపై ఈ ఘటన జరిగింది. ఖిలా వరంగల్ మండలం మామునూరు శివారులో వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీ వైపు నుంచి వరంగల్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. లారీ వివరాలు ఇంకా తెలియరాలేదు.
మృతులు వరంగల్ శివనగర్, కాశిబుగ్గకు చెందిన పోలేపాక వినయ్(27), చిన్నపల్లి ప్రదీప్(17) గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:Lorry hit by bike… .Two young men killed