ఆటోని ఢీకొన్న లారీ…ఆరుగురికి గాయాలు

సంగారెడ్డి ముచ్చట్లు:
సంగారెడ్డి  జిల్లా పఠాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామ సమీపంలో ఆటో ను ఢీ టిప్పర్ లారీ కొట్టింది. ఆటో లో ప్రయాణిస్తున్న ఆరు మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రి కి తరలించారు. ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలోని  రిలయన్స్ గ్యాస్ లైన్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆటో లో ప్రయాణిస్తున్న వారు చిన్న కంచర్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించిన గ్రామస్తులు చికిత్స కోసం పఠాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆటో లోని పాసింజర్లు చిన్న కంజర్ల  నుండి పఠాన్ చెరు కు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.  ఆటో ను ఢీ కొన్న టిప్పర్ లారీ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆపకుండా వెళ్లిపోవడంతో ఆటు వైపు వెళ్తున్న టిప్పర్ వాహనాలను రోడ్ పై నిలిపి వేసిన గ్రామస్తులు అందోళన కు దిగారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:Lorry  Six injured in auto collision

Natyam ad