Lost a good actor

మంచి నటుడిని కోల్పోయాం

Date:19/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
గుండు హనుమంతరావు మంచి నటుడు మాత్రమే కాదని, అంతకు మించిన మంచి వ్యక్తి అని నటుడు మోహన్బాబు అన్నారు. గుండు హనుమంతరావు మృతికి మోహన్బాబు సంతాపం తెలిపారు. ఏ పాత్రనైనా అవలలీలగా పోషించగల సమర్థుడు హనుమంతరావు అని ఆయన అన్నారు. అయన  మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. గుండు హనుమంతరావుకు బాలకృష్ణ నివాళులర్పించారు. గుండు హనుమంతరావు ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించారని ఆయన అన్నారు. గుండు హనుమంత రావు ధన్యజీవి అని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. తనకున్న అతి కొద్ది మంది మంచి మిత్రుల్లో గుండు హనుమంత రావు ఒకరని ఆయన చెప్పారు. హనుమంతరావు తన హాస్య ప్రదర్శనలతో ఎంతోమందిని అలరించారని, జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారని బ్రహ్మానందం అన్నారు. గుండు హనుమంతరావుకు భగవంతుడు ఆత్మశాంతిని కలుగజేయాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.నటుడు రాజేంద్ర ప్రసాద్  మాట్లాడుతూ గుండు హనుమంతరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాయలోడు, పేకాట పాపారావు, హైహై నాయకా, కొబ్బరి బొండాం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తాము కలసి నటించామని అన్నారు. నాతో పాటు నటించిన  ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ వంటివానిని నేను కోల్పోయాను. ఇవాళ మరొక… నా సోదరుడి వంటి వాడిని కోల్పోయాను. అందరమూ వెళ్లిపోవాల్సిందే అన్నారు.
Tags: Lost a good actor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *