జోరుగా మట్టి దందా.. అండగా అధికారులు
వరంగల్ ముచ్చట్లు:
అక్రమ మట్టి తవ్వకం దారులపై రెవెన్యూ అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా పంట పొలాల్లో మట్టి తవ్వకాలు జరుపుతున్న దందాపై కఠినంగావ్యవహరించాల్సింది పోయి… తూతూ మంత్రంపు చర్యలు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమవుతోంది.
మండలంలోని పసర గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమి నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా 14 ట్రాక్టర్లతో ఒక ఎక్స్‌కవేటర్‌ను వినియోగిస్తూ కొంతమంది మట్టి దందా తవ్వకాలు చేపడుతున్నారు.
సోమవారం ఇదే విషయంపై స్థానికులు, విలేకరులు మండల రెవెన్యూ అధికారి రమాదేవి దృష్టికి తీసుకెళ్లారు.మట్టి తవ్వకాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని అంగీకరించిన ఆమె మట్టిని
వెంచర్‌లోని అభివృద్ధి పనులకు తీసుకెళ్తున్నారని చెప్పడం గమనార్హం. అక్రమంగా మట్టి తరలిపోతోందన్న విషయం తెలిసినా..చర్యలు తీసుకోవడానికి అధికారిణి ప్రయత్నించలేదన్న విషయంస్పష్టమవుతోంది. వరుసగా కొంతమంది స్థానికులు, విలేఖరులు ఇదే విషయంపై ఫోన్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సదరు తహసీల్దార్ రమాదేవి సంఘటన స్థలానికి ఆర్.ఐ సుధాకర్‌ను పంపించారు.
ఎలాంటి అనుమతుల్లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్న ఎక్స్‌కవేటర్‌తో పాటు మొత్తం 14 ట్రాక్టర్లను సీజ్ చేయాల్సిన అధికారి కేవలం రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకోని మిగతా వాహనాలనువదిలేయడం గమనార్హం. అధికారులు వ్యవహరించిన తీరు రెవెన్యూ అధికారులు మట్టి దందాకు సహకరిస్తున్నారన్న అనుమానాలకు బలం చేకూర్చినట్లవుతోంది. జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పైజిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య దృష్టి పెట్టాలని జనం కోరుతున్నారు. అంతేకాకుండా మట్టి దందాకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
\
Tags: Loud mud danda .. Andaga authorities